»Popular Youtuber And Actor Director Eruma Saani Vijay Gets Married
Eruma Saani ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేసిన నటుడు.. దుమ్మురేపిన డ్యాన్స్
వీరిద్దరి ప్రేమకు పెద్దలకు అంగీకారం తెలపడంతో కొన్ని వారాల కిందట నిశ్చితార్థం కూడా వేడుకగా జరిగింది. ఇటీవల వివాహం అంగరంగ వైభవంగా చేసుకున్నారు. శుభముహూర్తాన నక్షత్ర మెడలో విజయ్ మూడు ముళ్లు వేశారు.
తన ప్రేయసి (Girl Friend) మెడలో ప్రముఖ యూట్యూబర్, తమిళ నటుడు (Tamil Actor) ఎరుమసాని విజయ్ (Vijay Kumar Rajendran) మూడు ముళ్లు వేశాడు. కొంతకాలంగా సాగుతున్న తమ ప్రేమ బంధం (Love Realtion) వివాహంతో ఒక్కటైంది. వీరిద్దరూ వైవాహిక (Marride Life) జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పెళ్లి వీడియోను షేర్ చేయగా.. వైరల్ గా మారింది. ఆ పెళ్లిలో వారిద్దరూ చేసిన డ్యాన్స్ (Dance) దుమ్మురేపింది.
కొన్నాళ్ల నుంచి మోడల్, ఫ్యాషన్ డిజైనర్ నక్షత్రతో (Nakshatra) విజయ్ ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరి ప్రేమకు పెద్దలకు అంగీకారం తెలపడంతో కొన్ని వారాల కిందట నిశ్చితార్థం (Engagement) కూడా వేడుకగా జరిగింది. ఇటీవల వివాహం (Marriage) అంగరంగ వైభవంగా చేసుకున్నారు. శుభముహూర్తాన నక్షత్ర మెడలో విజయ్ మూడు ముళ్లు వేశారు. కుటుంబసభ్యులు, కొద్దిపాటి బంధుమిత్రులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి, రిసెప్షన్ లో బంధుమిత్రులతో కలిసి నవ వధూవరులు సందడి చేశారు. వీరిద్దరూ కలిసి డ్యాన్స్ తో సందడి చేశారు. ఈ పెళ్లి వీడియో, ఫొటోలు తమ సొంత యూట్యూబ్ చానల్ తో పాటు వ్యక్తిగత సోషల్ మీడియాలో పంచుకున్నారు.
కాగా యూట్యూబర్ (Youtuber)గా ఉన్న విజయ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. హిప్ హాప్ ఆది దర్శకత్వంలో రూపొందిన ‘మీసై మురుకు’ అనే సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశాడు. నాన్ సిరితాల్ అనే సినిమా కూడా చేశాడు. అనంతరం డీ బ్లాక్ (D Block) సినిమాతో విజయ్ దర్శకుడిగా మారాడు.