TPT: పాకాల మండలం దామలచెరువు జీపీ లింగంచెరువులో సోమవారం లభ్యమైన మృతదేహం జార్ఖండ్‌కు చెందిన మానిక్ బౌరి (40)గా పోలీసులు గుర్తించారు. స్థానిక ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఇతడు శనివారం కూలీ డబ్బులు తీసుకుని కనిపించకుండా పోయాడని తోటి కార్మికులు చెప్పారు. అప్పటి నుంచి గాలింపు చేపడుతున్న క్రమంలో చెరువులో విగత జీవగా కనిపించాడని తెలిపారు.