ప్రకాశం: కనిగిరి శివనగర్ కాలనీలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకుడు పీసీ కేశవరావు ఆరోపించారు. సైడ్ కాలువలు, కల్వర్టులు దెబ్బతిని రోడ్డుతో కలిసిపోయాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి సందర్శించడం తప్ప సమస్యను పరిష్కరించలేదని మండిపడ్డారు. సమస్యను ఉన్నతాధికారులు పరిష్కరించాలని కోరారు.