TG: రాష్ట్ర పోలీసులకు అగ్ర నటుడు నాగార్జున అభినందనలు తెలిపారు. పైరసీకి వ్యతిరేకంగా పోలీసులు కృషి చేశారని, పైరసీ వల్ల సినీ ఇండస్ట్రీ నష్టపోతుందన్నారు. హైదరాబాద్ పోలీసులను ఇతర సినిమా ఇండస్ట్రీస్ కూడా అభినందిస్తున్నాయని చెప్పారు. పైరసీ సైట్ల వల్ల ప్రజల డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తోందన్నారు. ప్రజలకు ఉచితంగా సినిమా చూపించడం అనేది పెద్ద ట్రాప్ అన్నారు.