TG: సీపీ సజ్జనార్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు దిగ్గజ దర్శకుడు రాజమౌళి పేర్కొన్నారు. పైరసీ వల్ల చిత్రపరిశ్రమ వేల కోట్లు నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐబొమ్మ రవి పోలీసులను సవాల్ చేసి.. తన నెత్తిపై తానే చేయిపెట్టుకున్నాడని తెలిపారు. పైరసీని చాలామంది చిన్న విషయంగా భావిస్తారని, పైరసీ ముఠా వెనుక చాలా పెద్ద హస్తాలు ఉంటాయని ఆరోపించారు.