E.G: నిమ్మ ధరల పతనంతో జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. నల్లజర్లలో నిన్న 50 కిలోల బస్తా కేవలం రూ.400 పలికింది. దీంతో కోత కూలీ కూడా గిట్టుబాటు కావడంలేదని రైతులు వాపోయారు. గత ఏడాదితో పోలిస్తే ధరలు పడిపోవడం, దిగుబడి ఎకరాకు 20 బస్తాలకు తగ్గడంతో తీవ్ర నష్టాలు వాటిల్లుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చొరవ చూపాలని, నిమ్మ రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.