W.G: తణుకు మండలం దువ్వ గ్రామంలో నిన్న రాత్రి సూర్యబలిజ కార్తీక దీపోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్తీక మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ దీపోత్సవం వైభవంగా సాగిందని.. ఆ పరమేశ్వరుడు అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మనందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.