కడపలోని రాజారెడ్డి వీధిలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని నగర వన్ టౌన్ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. వన్ టౌన్ సీఐ చిన్న పెద్దయ్య ఆధ్వర్యంలో ఎస్సై అమర్ నాథ్ రెడ్డి దాడులు నిర్వహించారు. ఈ మేరకు అరెస్ట్ అయిన వారి వద్ద నుంచి రూ. 15,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.