VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాలతో పట్టణ ట్రాఫిక్ ఎస్సై ఎస్.భాస్కరరావు తల్లిదండ్రులకు ఆదివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. అలాగే ట్రిపుల్ డ్రైవింగ్ నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు పట్టుబడితే కోర్టుకు తరలిస్తామని పేర్కొన్నారు.