BDK: జిల్లాలో ఇవాళ నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమం విజయవంతం అయిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిని తెలిపారు. చదువు ఒక్కటే మనిషి జీవితాన్ని అందంగా మారుస్తుందని కలెక్టర్ వెల్లడించారు. కృషి పట్టుదల విజయానికి సోపానాలని తెలివితేటలు ఎవరి సొత్తు కాదని అన్నారు. కష్టపడితే భవిష్యత్తు అంతా బంగారమయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.