BDK: కొత్తగూడెం క్లబ్లో ఇవాళ నిర్వహించిన జాబ్ మేళాలో విధి నిర్వహణ చేసి తిరుగు ప్రయాణంలో ఉన్న ట్రాఫిక్ ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్ రోడ్డుపై నడవలేని ఇద్దరు దివ్యాంగులు ఇబ్బందిగా ఉన్నట్లు గమనించారు. వెంటనే స్పందించిన ఆయన తన సిబ్బంది పాషా సహాయంతో వారికి ఆటోలో ఎక్కించి కొత్తగూడెం బస్టాండ్ వరకు సురక్షితంగా పంపించారు.