CTR :పుంగనూరులో భక్తి భావంతో నిర్వహించే ‘లక్ష దీపోత్సవానికి’ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే కోనేటిని శుభ్రం చేసి సంప్రోక్షణ చేయించారు. రేపు కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు పుష్కరిణిలో దీపోత్సవం జరగనుంది. వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ముందస్తు ఏర్పాట్లు చేశారు.