సిరిసిల్ల: ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ అన్నారు. సిరిసిల్లలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా కమిషన్ల సిపార్సులను కాలదన్ని విద్యారంగానికి ఉద్దేశపూర్వకంగా ఏటేటా ప్రభుత్వం నిధులు తగ్గిస్తుందన్నారు.