ADB: ఢిల్లీ బాంబు పేలుడు ఘటనకు కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా సమితి డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మెస్రం భాస్కర్ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని కూకటివేళ్ళతో అంతమొందించాలన్నారు. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని కోరారు.