SKLM: ఆపదలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆదుకుంటుందని పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. కాగువాడ గ్రామానికి చెందిన హుస్సేన్ సాహెబ్ ఇటీవల కూలీ నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లి మృతి చెందారు. దీంతో ఆ కుటుంబానికి రూ.లక్ష చెక్కును ఇవాళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కుటుంబ పోషణ నిమిత్తం ఆదుకునేందుకు ఈ నిధులు వినియోగించాలని తెలియజేశారు.