VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారి స్వర్ణ పుష్పార్చన ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు 108 బంగారు పుష్పాలతో కన్నుల పండువగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై స్వామిని అధిష్ఠించి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి స్వర్ణపుష్పార్చన చేశారు.