SRD: ఖేడ్ నుంచి నాగలిగిద్ద మండల కేంద్రానికి వెళ్లే రహదారి మధ్య కొంత దూరం రోడ్డుపై గుంతలతో ప్రయాణం నరకంగా మారిందని వాహనదారులు తెలిపారు. దాదాపు కిలోమీటర్ దూరం రోడ్డు బాగా దెబ్బతిని, గుంతలు పడి కంకర తేలాయి. ఇలాంటి గతుకుల రోడ్డుపై ఆటోలో ప్రయాణంతో ఇక్కట్లు తప్పడం లేదని ప్రయాణికులు వాపోయారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.