NLR: ఇందుకూరుపేట పట్టణంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రంథాలయ పితామహులు డాక్టర్ రంగనాథన్, శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.