KNR: గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి స్టేజి వద్ద డబుల్ రోడ్డు నిర్మాణం కోసం యువజన సంఘాలు ఆదివారం మహాధర్నాకు పిలుపునిచ్చాయి. రాజీవ్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు గుండ్లపల్లి స్టేజీ వద్ద పోలీస్ బలగాలు భారీగా బందోబస్తు చేపట్టారు.