KNR: కరీంనగర్ భరోసా కేంద్రాన్ని సీపీ గౌష్ ఆలం సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బాధిత మహిళలకు భరోసా కల్పించడంలో ఈ కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందని, భరోసా కేంద్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి బాధితులకు అందించిన సేవలు, వాటి సత్ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే చోట న్యాయ సహాయం, వైద్యం, సైకోథెరపీ అందించే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు.