ELR: వంతెన కింద నిద్రిస్తున్న ఓ వలస కూలీని గుర్తుతెలియని వాహనం బలిగొన్న ఘటన పెదపాడు మండలం తాళ్లమూడిలో శనివారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వల్లి కృష్ణమూర్తి (40) విజయరాయిలో పనుల కోసం వచ్చి, తాళ్లమూడి వంతెన కింద నిద్రిస్తుండగా వాహనం అతని పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు