AP: విజయవాడలో వంగవీటి రంగా ఫ్యామిలీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇవాళ్టి నుంచి ప్రజాజీవితంలోకి రాబోతున్నట్లు వంగవీటి రంగా కూతురు ఆశాకిరణ్ ప్రకటించారు. ‘రాజకీయ ఎంట్రీపై తర్వాత స్పందిస్తాను. రాధారంగా మిత్రమండలి సూచించిన పార్టీలో చేరుతాను. YCP ఆహ్వానంపై ఇప్పుడే స్పందించలేను. సోదరుడు రాధతో విభేదాలు లేవు. మా గమ్యం రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం’ అని పేర్కొన్నారు.