ప్రకాశం: వెలిగండ్ల జడ్పీ పాఠశాలలో ఇవాళ ఉచిత వైద్య శిబిరం చేస్తున్నట్లు నిర్వాహకులు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ఎముకలు, కీళ్లు, నరములు, కంటి సంబంధిత వ్యాధులకు ఉచితంగా డాక్టర్లు పరీక్షలు చేస్తారని తెలిపారు. బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు ఉచితంగా చేసి రోగులకు ఉచితంగా మందులు అందజేస్తారని పేర్కొన్నారు. మండలంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.