RR: కందుకూరు మండల పరిధిలోని మీర్ఖాన్పేట్లో డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్కు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను సీపీ సుధీర్ బాబు శనివారం పరిశీలించారు. పార్కింగ్ స్థలం, హెలిప్యాడ్ ప్రదేశం, మీటింగ్ ప్రదేశాన్ని పరిశీలించి.. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, బందోబస్తు ఎలా చేపట్టాలనే అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.