NLR: పెన్నా పరీవాహక ప్రాంత పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు. ఇవాళ మ. 2 గంటలకు సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారని అన్నారు. పెన్నా పరీవాహక ప్రాంత పంచాయతీ కార్యదర్శులు, గ్రామాలలో దండోరా వేయించి ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసి, వారిని అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు.