రాస్ బెర్రీస్‌లో విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రక్తపోటును నియంత్రించి గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బరువును అదుపులో ఉంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. మెదడు, కంటి, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.