ELR: చింతలపూడి మండలం వెంకటాపురానికి చెందిన ఓ వ్యక్తికి ఏడాది జైలు, రూ.5000 జరిమానా విధిస్తూ ఏలూరు కోర్టు 5వ జడ్జ్ మురళీకృష్ణ శుక్రవారం తీర్పు ఇచ్చారు. 2023 మే 15న ఆ గ్రామానికి చెందిన ఓ మహిళ స్నానం చేస్తుండగా కలపాల వేణు ఆమెపై అఘాయిత్యం చేసినట్లు సదరు మహిళ ఫిర్యాదు చేసింది. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష పడిందన్నారు.