అనంతపురం జిల్లాలో ఈనెల 19 నుంచి వరల్డ్ హెరిటేజ్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. అందులో భాగంగా 19న కలెక్టరేట్ నుంచి పీఎస్కే మ్యూజియం వరకు హెరిటేజ్ వాక్ ఉంటుందని పేర్కొన్నారు. 20న నాణేలు, స్టాంపుల ఎగ్జిబిషన్, 21న పద్యపఠన పోటీలు, 24న సంప్రదాయ వంటకాల తయారీ వంటి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.