తమిళనాడులో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన పిలాటస్ పీసీ-7 శిక్షణ విమానం కూలిపోయింది. చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాంబరం వైమానిక దళ స్థావరం నుంచి విమానం బయల్దేరింది. అయితే, కొద్ది సేపటికే తిరుప్పోరూర్ ఉప్పళం ప్రాంతంలోని ఉప్పు తయారు చేసే పరిశ్రమ వద్ద కూలిపోయింది. అందులోని పైలట్ సహా ముగ్గురు పారాచూట్ సహాయంతో క్షేమంగా బయటపడ్డారు.