KDP: బద్వేలు నియోజకవర్గంలోని రజకుల ల్యాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్ జీవో నెంబర్ 24ను అమలు చేయాలని నాయిబ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలవలి వేణుగోపాల్ అధికారులను కోరారు. శుక్రవారం బద్వేలు పట్టణంలోని విద్యుత్ కార్యాలయంలో రజక సంఘం నాయకులతో కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు.