అన్నమయ్య: విధుల్లో ఉండగా ఆగస్టు 18న రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డు బి. ఈశ్వర్ నాయక్ (HG-323) కుటుంబానికి SP ధీరజ్ శుక్రవారం రూ. 30 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ బాధిత కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. అంకిత భావంతో పనిచేసిన హోంగార్డు అకాల మరణం బాధాకరమన్నారు.