ప్రకాశం: కనిగిరిలో తప్పిపోయిన బాలుడిని ఎస్సై శ్రీరామ్ తండ్రి సుల్తాన్ బాషాకు అప్పగించారు. కావలికి చెందిన బాలుడు స్కూల్కు వెళ్లమని తండ్రి మందలించడంతో అలిగి వెళ్లిపోయాడు. అమ్మమ్మ ఊరు దేవాంగనగర్కు వచ్చి తప్పిపోయాడు. పోలీసులు బాలుడిని సంరక్షించి వివరాలు తెలుసుకుని తండ్రికి శుక్రవారం రాత్రి అప్పగించారు.