NZB: మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురికి రూ.పది వేల చొప్పున మొత్తం రూ.40 వేలు జరిమానాను ఆర్మూర్ సెకండ్ క్లాస్ స్పెషల్ కోర్టు మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ విధించారని సీఐ సత్యనారాయణ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన ధ్రువ పత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు.