సూర్యాపేట మండలం కేసారం ప్రాథమికోన్నత పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా చేశారు. HM జయమ్మ మాట్లాడుతూ.. మీ పిల్లలు చదువు రాకపోతే నన్ను నిలదీయండి అంటూ తల్లిదండ్రులకు తెలిపారు. విద్యార్థులకు బ్యాగులు, సామాగ్రిని దండ ధరణిదర్ రెడ్డి, మురళిదర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ ఏడాది 16 మంది కొత్తగా చేరారని, వచ్చే ఏడాది చేరికలు మూడింతలు పెరగాలని కోరారు.