GNTR: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం క్లస్టర్ ఇంఛార్జ్‌ల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని, క్లస్టర్ ఇంఛార్జ్‌లకు పార్టీ బలోపేతంపై పలు సూచనలు చేశారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత శక్తివంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.