NZB: బాలల దినోత్సవం పురస్కరించుకొని మోపాల్ మండలం సిర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వయం పాలన దినోత్సవాన్ని ఇవాళ నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థులు టీచర్లుగా మరి ఇతర తరగతుల విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారని HM సత్య నారాయణ తెలిపారు. ఉత్తమంగా బోధించిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.