సత్యసాయి: గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద ఉన్న ఐఎంఎఫ్ఎల్ డిపోలో 32 మంది టీడీపీ కార్యకర్తలకు మంత్రి సవిత ఉపాధి అవకాశాలు కల్పించారు. ఈ సందర్భంగా ఉపాధి పొందిన కార్యకర్తలు మంత్రి సవితను ఇవాళ పెనుకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధి కల్పించినందుకు కార్యకర్తలందరూ మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.