AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ర్యాలీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గుంటూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసుల వైఖరికి నిరసనగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.