AP: మెడికల్ కాలేజీల పేరుతో వైసీపీ కొత్త నాటకం ఆడుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. కేంద్ర నిధులు రూ.1,550 కోట్లు తప్ప.. వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. జగన్ మోడల్ అంటే ఆలస్యం.. చంద్రబాబు మోడల్ అంటే సూపర్ ఫాస్ట్ అని వ్యాఖ్యానించారు. కేవలం రెండేళ్లలో మెడికల్ కాలేజీలు పూర్తి చేసేందుకే పీపీపీ మోడల్ అని పేర్కొన్నారు.