MNCL: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనతో మంచిర్యాలలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనుమాననిత ప్రయాణికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు.