KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర రోజురోజుకూ తగ్గుతుండటంతో రైతులు నిరాశ చెందుతున్నారు. గత శుక్రవారం పత్తి ధర రూ 7,000 పలకగా, సోమవారం రూ 100 తగ్గి రూ 6,900 పలికింది. మంగళవారం మరో రూ 50 తగ్గి, రూ 6,850 ధరకు చేరింది. అధికారులు స్పందించి ధరలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.