ఢిల్లీ పేలుడు ఘటనకు ముందు కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. హ్యుందాయ్ i20 కారులో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. పేలుడుకు కొన్ని క్షణాల ముందు ఓ వ్యక్తి కారు నడుపుతున్న దృశ్యాలను గుర్తించారు. అతడు వైద్యుడైన మహ్మద్ ఉమర్గా అనుమానిస్తున్నట్లు సమాచారం. ఇతడికి ఫరీదాబాద్ మాడ్యూల్తో సంబంధాలు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.