Weather Update: ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు
మూడు రోజుల పాటు ఏపీ(AP)లోని పలు ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ(weather Department) తెలిపింది.
ఏపీ(AP)కి వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. వేసవిలో ఎండలతో మండుతున్న ఏపీకి వర్షసూచన(Rain alert) చేసింది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు(Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(weather Department) వెల్లడించింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
మూడు రోజుల పాటు ఏపీ(AP)లోని పలు ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ(weather Department) తెలిపింది. అయితే పగటి పూట మాత్రం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ నుంచి చత్తీస్ గఢ్ మీదుగా ఉత్తర తెలంగాణ వరకూ ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాగల మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.