బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై ఆయన టీమ్ స్పందించింది. ధర్మేంద్ర అనారోగ్యంతో ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, ఇవి అన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని ఆయన టీమ్ స్పష్టం చేసింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొంది.