ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సోమవారం పట్టణంలోని యల్లనూరు రోడ్డు బైపాస్ వద్ద జరుగుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. గుజరాత్ నుంచి వచ్చిన ప్రత్యేక డ్రైనేజీ బృందం చేస్తున్న పనుల నాణ్యత గురించి అధికారులను, బృందం సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.