సత్యసాయి: సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా పుట్టపర్తిలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన అడిషనల్ డీజీ మధుసూదన్ రెడ్డిని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి సత్యసాయి బాబా వారి చిత్రపటాన్ని డీజీకి బహుకరించారు. పోలీసు భద్రత, ఉత్సవ ఏర్పాట్లపై వారు కొద్దిసేపు చర్చించారు.