SRPT: ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ఆదివారం మునగాల మండల కేంద్రంలోని జాతీయ రహదారి 65పై వాహనాలను తనిఖీ చేస్తూ పరిమితికి మించి జనాలను ఎక్కించుకున్న 10 ఆటోలను ఆపి, ఫైన్ విధించినట్లు తెలిపారు.