TG: తమపై కేటీఆర్ చేసిన విమర్శలు సినిమాలో ఐటం సాంగ్ లాగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. శ్రీలీల ఐటం సాంగ్కు కేటీఆర్ ప్రచారానికి తేడా ఏం లేదన్నారు. రెండేళ్ల మా పాలనను పదేళ్ల BRS పాలనతో పోల్చకండి. వాళ్ల అప్పులు తీరుస్తూ పథకాలు అమలుచేస్తున్నాం. KCR కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్తో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా?’ అని అడిగారు.