NLR: ఉదయగిరి మండలం గండిపాలెం జలాశయంలో ఎవరైనా అనధికారికంగా చేపలు పడితే చర్యలు తప్పవని జలాశయ మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు బచ్చల చెన్నారాయుడు పేర్కొన్నారు. తాము ప్రభుత్వం నుంచి అనుమతి పొంది జలాశయంలో చేప పిల్లలను వదిలామన్నారు. జలాశయం వద్ద తాము కాపలా ఉన్నా కొందరు గుట్టుచప్పుడు కాకుండా జలాశయం పైతట్టు ప్రాంతంలో చేపలను వేటాడుతున్నట్లు తెలిపారు.