సోషల్ మీడియా(Social media) ప్రాచుర్యంలోకి వచ్చాక.. రోజూ కొన్ని వందల వీడియోలు(Videos) అప్ లోడ్ అవుతున్నాయి. నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. వాటిలో ఫైటింగ్ వీడియోలు(Fighting Videos) చాలానే ఉన్నాయి.
Viral : సోషల్ మీడియా(Social media) ప్రాచుర్యంలోకి వచ్చాక.. రోజూ కొన్ని వందల వీడియోలు(Videos) అప్ లోడ్ అవుతున్నాయి. నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. వాటిలో ఫైటింగ్ వీడియోలు(Fighting Videos) చాలానే ఉన్నాయి. అలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియో ప్రస్తుతం వైరల్(Viral) అవుతోంది. నడి రోడ్డుపై ఇద్దరు వృద్ధులు బాహా బాహికి దిగారు. ఓ వృద్ధుడు మరో వృద్ధుడిని కింద పడేసి చితకబాదాడు. దాదాపు ఓ రెండు నిమిషాల పాటు ఇద్దరు వృద్ధుల మధ్య తీవ్ర పోరాటమే నడిచింది.
ప్రస్తుతం వృద్ధుల ఫైటింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో మహారాష్ట్ర(Maharastra)కు చెందినదిగా తెలుస్తోంది. ఔరంగాబాద్‌లోని ఓ వీధిలో ఇద్దరు వృద్ధులు.. ఒకరు బైక్‌పై, మరొకరు స్కూటీపై వెళ్తున్నారు. ఏమైందో తెలియదు కానీ.. ఇద్దరూ నడిరోడ్డుపై తమ ద్విచక్ర వాహనాలను ఆపారు. ఒకరికొకరు దూషించుకున్నారు. అంతలోనే ఓ పెద్దాయన మరో వృద్ధుడిపై చేయి చేసుకున్నాడు. ఆయనను కింద పడేసి కొట్టాడు. అలా ఇద్దరూ కలిసి ఓ రెండు నిమిషాల పాటు కొట్టుకున్నారు. అనంతరం ఎవరి దారినా వారు వెళ్లిపోయారు. అసలు వారిద్దరూ ఎందుకు కొట్టుకున్నారనే విషయం మాత్రం తెలియలేదు.